Saturday, April 9, 2016

Sita Kalyanam - Invitation


శ్రీరస్తు                                    శుభమస్తు                         అవిఘ్నమస్తు 


 జానక్యాః కమలామలాంజలి పుటేయాః  పద్మరాగాయితాః 
న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కున్ద ప్రసూనాయితాః  !
స్రస్తా శ్యామల కాయకాన్తి కలితాః యా ఇన్ద్ర నీలాయితాః 
ముక్తాస్తాశ్శుభదా భవన్తు భవతామ్ శ్రీరామ వైవాహికాః  !!

శ్రీ సీతారామ కళ్యాణ తలంబ్రాలు - జానకీదేవి ఎర్రని అర చేతిలో పద్మ రాగ మణుల లాగా, రామ చంద్ర మూర్తి తలపై పడగానే మల్లె పూవుల లాగా, రామ చంద్ర మూర్తి తల నుంచి శరీరం మీదకి జాలువారగానే ఇంద్ర నీల మణుల లాగా - వర్ణరంజితమౌతున్నాయి.

ఆ కళ్యాణ తలంబ్రాల కాంతులు తాకిన కనులు ఏ మణులుగా మారునో ! ఆ జగత్కళ్యాణ కళ్యాణము నిండిన మది మణిద్వీప మవునేమో !



స్వస్తిశ్రీ చంద్ర మానేన శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం చైత్ర శుద్ధ నవమి శుక్ర వారం శుభ సమయమందు మా స్వగృహమున శ్రీ సీతా రామ కళ్యాణ వేడుక జరుపుకొనుచున్నాము. కావున తామందరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి, ఆ కళ్యాణ వేడుకలలో పాల్గొని, భోజన తాంబూలాదులు  అందుకొని మమ్మానందింపజేయ ప్రార్థన.

 మంగళం మహత్ 
  శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ


మీ ఆగమనాభిలాషులు,
శ్రీ రాచపూడి హరిప్రసాద్, శ్రీమతి హనుమాయమ్మ,
శ్రీ రాచపూడి వెంకటేష్, శ్రీమతి కృష్ణవేణి

No comments:

Post a Comment